ఓ ఇంట్లో 111 నాగుపాము పిల్లలు, 26గుడ్లు

ఒక పాము కనిపిస్తేనే భయం తో బిగుసుకుపోతాం.. ప్రాణ భయంతో పరుగులు తీస్తాం.. మరి తమ పిల్లపాపలతో నివసించే ఇంట్లో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 111 నాగుపాము పిల్లలు కనిపిస్తే.. ఆ కుటుంబ సభ్యుల భయం ఏ స్థాయిలో ఉంటుందో ఉహించండి.. ఈ ఘటన ఓడిశా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో వెలుగుచూసింది.

ఇంటి యజమానికి తన ఇంట్లోని ఓ గదిలో 26 నాగుపాము గుడ్లు కనిపించాయి. దీంతో ఇంటి యజమాని అటవీశాఖాధికారులతోపాటు స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు. నాగుపాము గుడ్లు కనిపించడంతో పాములు కూడా ఇక్కడే ఉండి ఉంటాయని అటవీశాఖ అధికారులు గాలించారు. దీంతో మరో చోట నాగుపాము పిల్లలు కనిపించాయి. అనంతరం ఆ ఇంట్లో పాము పిల్లల కోసం గాలించగా.. ఏకంగా 111 నాగుపాము పిల్లలు బయటపడ్డాయి. అయితే ఈ నాగుపాము పిల్లలు ఎవరినీ కాటేయక పోవడం విశేషం. అటవీశాఖ అధికారులు నాగుపాము పిల్లలను అటవీ ప్రాంతానికి తరలించారు.. ఆడ నాగుపాము ఇంట్లోకి వచ్చి గుడ్లు పెట్టి ఉంటుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here