జగన్ నిర్లక్ష్యంతో టిడిపి వైపు చూస్తున్న కీలక నేతలు

కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా ఉండడం లేదు. దీనికి బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో జగన్ పాదయాత్ర చేపట్టిన సందర్భంగా. తనకు వచ్చే ఎన్నికల్లో పెనమలూరు టికెట్ ఇవ్వాలని, నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటాననీ పార్థసారథి అడిగినా జగన్ పెద్దగా పట్టించుకోలేదట. ఇప్పటివరకూ దానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక తనకు ఆ టికెట్ ఇవ్వడం కష్టమేననే ఆలోచనకు వచ్చిన ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక చేసేది ఏమీలేక, టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తనకు సముచిత స్థానం కల్పిస్తే టీడీపీలో చేరుతానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినం జగన్ మోహన్ రెడ్డి కీలక నేతలను రంగం లోకి దించినా ఉపయోగం లేదని తెలుస్తుంది, ఇదిలా ఉంటె ఈ విషయం పై చంద్రబాబు మరొక వారంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. గత ఎన్నికలకు ముందే మంత్రిగా ఉన్న పార్థసారథి టీడీపీలోకి వస్తానని…తనకు నూజివీడు లేదా కైకలూరు సీటు ఇవ్వాలని కోరగా అప్పట్లో టీడీపీ ఆ వినతిని పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ నిర్లక్ష్యం నచ్చక పార్టీ మారటానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here