గల్లా అరుణకుమారి కి తెదేపా పోలిట్ బ్యూరోలో స్థానం

మాజీ మంత్రి, గల్లా అరుణకుమారి కి తెదపా లో అరుదైన గౌరవం దక్కింది. ఆమెకి తెదేపా పోలిట్ బ్యూరోలో స్థానం లభించింది. గల్లా అరుణ ఇటీవల చంద్రబాబు ని కలిసి చంద్రగిరి రాజకీయాల పట్ల అనాసక్తత తెలియచేసిన సంగతి తెలిసిందే. అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా రాజకీయాలలో ప్రముఖుడు రైతు నాయకుడు, సాహితీవేత్త ఐన పాతూరి రాజగోపాలనాయుడు కి స్వయానా కుమార్తె. పి. రాజగోపాలనాయుడు ఆచార్య NG రంగ తో కలసి స్వతంత్ర పార్టీని స్తాపించారు. ఈయన శిష్యుడే నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. దీని ద్వారా చంద్రబాబు తన రాజకీయ గురువు ఋణం తీర్చుకోన్నట్లు రాజకీయవర్గాల విశ్లేషణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here