ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌లపై తగ్గింపు ధర..

టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తూ.. వినియోగదారులను అమితంగా ఆకర్షించింది.. రిలయన్స్ జియో.. మార్కెట్లో మరెన్నో ఆఫర్లను ప్రవేశ పెడుతూ.. రోజు రోజుకీ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ నేపధ్యంతో మిగత టెలికాం సంస్థలు తమ వినియోగదారులను పోగొట్టుకోకుండా ఉండాలంటే కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశ పెట్టాలి. ఈ విషయం లో జియో తో ఎయిర్ టెల్ పోటీపడుతుంది. ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌లపై తగ్గింపు ధరల్ని ప్రవేశపెట్టింది. ఆరు నెలల ప్లాన్ తీసుకుంటే 15 శాతం, ఏడాది ప్లాన్ తీసుకుంటే 20 శాతం డిస్కౌంట్‌ని ఆఫర్ చేసింది. ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తున్న 300 ఎంబీపీఎస్ ప్లాన్‌కు నెలవారీ చార్జి రూ.2,199గా ఉంది. డేటా పరిమితి 1200 జీబీ. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ చేస్తున్న ఈ ప్లాన్ సబ్ స్క్రయిబ్ చేసుకుంటే అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here