భారత మార్కట్త పై కన్ను… తక్కువ ధరకే ఐఫోన్… !!

ఆపిల్ సంస్థ భారత్ మార్కెట్ పై కన్నేసి… తక్కువ ధరలోకి అందుబాటులో తీసుకొచ్చే ఉద్దేశ్యంతో ఉంది. 6.1 అంగుళంతో కూడిన ఈ ఫోన్‌ను 600 డాలర్ల ప్రారంభ ధరతో విడుదల చేయనుంది. అంటే మన దేశంలోకి అడుగు పెట్టె సరికి దీని ధర అన్ని పన్నులతో కలుపుకుని 50 వేలుగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇది ఇప్పుడు ఉన్న ఐఫోన్ ఎక్స్‌లో మార్పులు చేసిన వెర్షనా లేక మరేదైనా అన్న దానిపై పూర్తి సంచారం తెలియాల్సి ఉంది. కాకపోతే ఫీచర్స్ అన్నీ కూడా ఐఫోన్ ఎక్స్ మాదిరిగానే ఉంటాయని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. ఇందులో ఫేస్ ఐడీ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. ఓఎల్ఈడీ డిస్ ప్లే కాకుండా ఎల్ సీడీ డిస్‌ప్లేతో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here