కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించాలని ముష్కరులకు పిలుపు

ముంబై పేలుళ్ళ ప్రధాన సూత్రధారి.. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ భారత్ పై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.. హింసాత్మక దాడులతో కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించాలంటూ ముష్కరమూకలకు పిలుపునిచ్చాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కొత్త శకం ప్రారంభమైందని.. దేవుడి దయతో కాశ్మీర్‌ స్వతంత్ర దేశంగా అవతరించనుందన్నారు.

కశ్మీర్‌లో రక్తం పారుతోందని, దేవుడు చూస్తున్నాడని, ఆయన త్వరలోనే తీర్పు చెబుతాడన్నాడు. ఎందుకంటే నిర్ణయాలన్నీ పైనుంచే వస్తాయని.. వాషింగ్టన్‌ నుంచి కాదన్నాడు. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం రావడం ప్రపంచం కళ్లారా చూస్తుందని… భారత భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతున్నవాళ్లను ‘అల్లా’ చూస్తున్నాడు పేర్కొన్నాడు. వాళ్లు చనిపోతూ కూడా పాకిస్తాన్‌, కశ్మీర్‌ ఐక్యత గురించి మాట్లాడుతున్నారని… కశ్మీర్‌లో ఇది నూతన శకమని… మోదీ దానిని అడ్డుకోలేరంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here