విశాఖకు కూతురు ఆద్య, కుమారుడు అకిరాలతో చేరుకున్న పవన్

పవన్ కళ్యాన్ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో రేణు దేశాయ్ తో విడిపోయినా తన పిల్లలకు తండ్రిగా ప్రేమను పంచుతూ.. ఉండేవాడు.. ఏ మాత్రం ఖాళీ దొరికినా పూణే వెళ్లి వారితో గడిపేవాడు.. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి పెట్టి.. బిజీగా ఉన్నారు.. దీంతో అకిరా, ఆద్యలు తండ్రి వద్దకు వచ్చి తమ వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 26నుంచి విశాఖలో తన పోరాట యాత్ర ను చేయనున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ సోమవారం విశాఖకు చేరుకున్నారు. గతంలో ఉత్తరాంధ్ర యాత్ర కు ఒంటరిగా వస్తే… మధ్యలో తమ్ముడి కోసం అక్క వెళ్ళింది.. రంజాన్ కు తన యాత్రకు విరామం ప్రకటించిన పవన్ మళ్ళీ యాత్రను చేపట్టడానికి రెడీ అయ్యారు.. అయితే ఈ సారి విశాఖ కు తన కుమారుడు అకిరా నందన్, కుమార్తె ఆద్య లతో కలిసి వచ్చారు. పవన్ రుషికొండలోని సాయి ప్రియ రిసార్ట్స్ లో బస చేశారు. రేపటి నుంచి తన యాత్రను ప్రారంభించనున్నారు. కాగా తన మాజీ భార్య రేణు దేశాయ్ నిశ్చితార్ధం జరుపుకోవడంతో ట్విట్టర్ వేదికగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here