రేణు దేశాయ్ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాన్

రేణు దేశాయ్ రెండో వివాహం పై ఆమె మాజీ భర్త.. ప్రముఖ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమె రెండో పెళ్లికి తన మద్దతు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా పవన్ స్పందిస్తూ… ‘కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న రేణు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. అంతా మంచే జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రకృతి తనకు సమృద్ధియైన ఆయురారోగ్యాలు, ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

పవన్ స్పందనపై ఇరువురి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేణు దేశాయ్ ఎక్కడున్నా ఆమె మంచి కోరుకునే వ్యక్తి పవన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రేణుని ఎందుకు వదిలేశారు.. ఇద్దరూ కలిసి ఉంటే బాగుండేదని మరికొందరు కోరుతున్నారు… మరికొంత మంది నెటిజన్లు ఆ ఇద్దరి మధ్య ఏమి జరిగిందో మనకు తెలియదు.. దారులు వేరయ్యాయి.. ఎప్పుడు పవన్, రేణు దేశాయ్ లు సంతోషంగా ఉండాలి.. అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా రేణు దేశాయ్ వివాహం జులై నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here