మోడీ షా ద్వయానికి బీహార్ సిఎం షాక్… ఎన్డియే కూటమి నుంచి జారుకొనే దిశగా అడుగులు

ఎన్నికలు సమీపిస్తున్నాయి… దీంతో అధికారం దక్కించుకోవడానికి ప్రతి పక్షాల ఆరాటం… ఉన్న అధికారం నిలుపుకోవడానికి అధికార పక్షం పోరాటం అన్నట్లు గా ఉంది.. కేద్రంలో .. అయితే బిజేపీ అధిష్టానానికి బిహార్ సిఎం నితీష్ కుమార్ గట్టి షాక్ ఇచ్చారు.. ఇప్పటికే ఎన్డియే కూటమినుంచి శివసేన, టిడిపి జారుకున్నాయి… ఈ నేపథ్యంలో తాము కూడా ఎన్డియే నుంచి వైదొలగే అవకాశం లేదని నితీష్ వ్యాఖ్యానించారు.
నెక్స్ట్ ఎన్నికలల్లో ఎవరి అవసరం లేదని అని బిజేపీ భావిస్తే… బిజేపీ ఒంటరిగా బరిలోకి దిగవచ్చు అని జెడియు స్పష్టం చేసింది. అంతేకాదు.. తమ రాష్ట్రంలోని 40 స్థానాల్లో బిజేపీ సింగిల్‌గా పోటీ చేయవచ్చని, వారికి ఎవరూ అడ్డు చెప్పరని జేడీయూ ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ అన్నారు. సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రతి పార్టీకి ఉందన్నారు.. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చని… తమకొచ్చే నష్టమేమీ లేదని పేర్కొన్నారు….
సీట్ల పంపకంపై బీజేపీ, జేడీయూ మధ్య ఇటీవల తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గానూ జేడీయూ 71 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 53 స్థానాలు దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి తాము బీజేపీ కంటే బలంగా ఉన్నామని… సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తరపున రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలన్న నిర్ణయం తమకే వదిలేయాలని పట్టుపడుతోంది జేడీయూ… ఒకవేళ కుదరకపోతే సింగిల్‌గానైనా పోరుకు సిద్ధమనే సంకేతాలిస్తోంది..
అంతేకాదు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీచేసేందుకు జేడీయూ ఎప్పుడూ సిద్ధమని.. అయితే సీఎం నితీశ్ లేకుండా బీజేపీ గెలవడం సాధ్యం కాదన్నారు సంజయ్‌…. 2014 ఎన్నికలకు, 2019కి చాలా తేడా ఉందని… దేశంలో ఆయా అంశాల ఆధారంగా రాజకీయాలు జరుగుతున్నాయన్నారు… నితీశ్ లేకుండా బీహార్‌లో నెగ్గడం కష్టమని బీజేపీకి బాగా తెలుసన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here