టీఆర్ఎస్ లో వర్గ పోరు.. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని హల్ చల్

అధికార పార్టీ టీఆర్ఎస్ లో వర్గ పోరుకు వేదికగా సూర్యా పేట జిల్లా మారింది. హుజూర్‌నగర్‌లో ఆధిపత్య పోరాటం రోడ్డెక్కింది. హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా శంకరమ్మ వ్యవహరిస్తుండగా.. బైక్‌ర్యాలీకి ఎన్నారై సైదిరెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుకున్న శంకరమ్మ.. తన వర్గంతో కలిసి వచ్చి బైక్‌ ర్యాలీని అడ్డుకుంది. ప్రత్యర్థి వర్గాన్ని బండబూతులు తిట్టింది శంకరమ్మ. ఇదే సమయంలో శంకరమ్మ అనుచరుడు తనపై పెట్రోల్ పోసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here