ఐటిఐ అభ్యర్ధులకు రైల్వే లో ఉద్యోగావకాశాలు

ఐటిఐ అభ్యర్ధులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వే వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ధర‌ఖాస్తులు కోరుతోంది. పదోతరగతితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. అన్ని అర్హతలు ఉన్నవారు దరఖాస్తులను జులై 25లోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

మొత్తం 2,573… పోస్టులు ఖాళీలు ఉండగా… ముంబై లో 1799, భుసావ‌ల్ 421,పుణెలో 152, నాగ్‌పూర్లో 107, షోలాపూర్94 లు ఉన్నాయి.
అర్హ‌త‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తితో పాటు సంబంధిత విభాగం(ట్రేడ్)లో ఐటీఐ ఉండాలి.
వ‌య‌సు: 18.06.2018 నాటికి 15 – 24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంది.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 26.06.2018.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.07.2018.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here