రెడీ అవుతున్న చంద్రబాబు గుడి… వెండి విగ్రహం

ఆర్ధిక లోటు ఉన్నా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా సిఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఆడ, మగ కాదంటూ అసహ్యించుకుంటూ… తక్కువ భావంతో చూసే హిజ్రాలపై బాబు వరాల జల్లు కురిపించారు. తమ మొర ఆలకించి తమ విన్నపాన్ని మన్నించిన సిఎం చంద్రబాబుకి వారు కృతజ్ఞతలు తెలిపుతూ.. గుడి కడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా నంద్యాల లో చంద్రబాబుకి హిజ్రాలు గుడిని నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి శంకుస్థాపన మంత్రి అఖిల ప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిలు చేశారు.
ఈ ఆలయ నిర్మాణానికి టిజి. వెంకటేష్, మంత్రి అఖిలప్రియ, స్థానిక నేత అభిరుచి మధులు సహకరిస్తున్నారు. 10 కేజీల వెండితో చంద్రబాబు విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఏపీలోని హిజ్రాలకు రూ. 1500 పెన్షన్, తెల్ల రేషన్ కార్డును చంద్రబాబు ప్రకటించారు. అందుకు తమ చంద్రబాబు దేవుడితో సమానం అంటూ గుడిని హిజ్రాలు కట్టిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here