ఎట్టకేలకు ఫిఫా2018 నాక్ అవుట్ దశకు అర్జెంటీన..!

రాత్రి నైజేరియా తో జరిగిన చివరి గ్రూప్ D మ్యాచ్లో అర్జెంటీన 2-1 తేడా తో విజయం సాధించి రౌండ్ అఫ్ 16 లోకి అడుగుపెట్టింది. ఫిఫా ఫేవరెట్ గా అడుగుపెట్టిన , రెండు సార్లు విశ్వవిజేత కూడా ఐన అర్జెంటిన ఈసారి చివరి 16 లోకి కష్టపడాల్సివచ్చింది. ఆట 86వ నిముషంలో డిఫెండర్ మార్కస్ రోజో చేసిన గోల్ తో విజయం సాధించింది. అంతకుముందు మెస్సి ఆట 14 వ నిముషంలో గోల్ చేయగా, నైజేరియన్ ఆటగాడు విక్టర్ మోసెస్ 51వ నిముషంలో గోల్ చేసి స్కోర్ 1-1 చేసి అర్జెంటినా కు చెమటలు పట్టించాడు. అద్భుతమైన ఎటాకింగ్ ఆటగాళ్లున్న అర్జెంటీన కు మిడ్ ఫీల్డ్ డిఫెండర్ తన అద్భుతమైన గోల్ తో జట్టుకు విజయాన్ని చేకుర్చాడు.

ఈ విజయంతో అర్జంటినా ఇక ప్లే ఆఫ్ మ్యాచ్లో ఫ్రాన్స్ తో ఆడాల్సి వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here