బీటెక్ రవి కడప ఉక్కు దీక్ష భగ్నం ….!

గత 8 రోజులుగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌తో పాటూ బీటెక్ రవి కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపనకై ఆమరణ దీక్ష చేస్తున్నారు. గత రెండు రోజులు వారిద్దరి ఆరోగ్యం దిగజారడంతో ముఖ్యమంత్రి ప్రత్యెక పర్యవేక్షణ కోసం మంత్రి గంటాను నేడు కడప కు పంపారు. ఐతే ఇద్దరిలో బీటెక్ రవి ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో పోలీసులు బలవంతంగా ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ఈసాయంత్రం వైద్య పరిక్షల అనంతరం డాక్టర్లు కోమాలోకి వెళ్ళే అవకాశం వుందని, ప్రాణానికి కూడా ప్రమాదమని అధికారులను అప్రమత్తం చేయగా, పోలీసులు రంగంలోకి దిగి కడప రిమ్స్ వైద్యశాలకు తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంది..
ఐతే సీఎం రమేశ్‌ దీక్షను కూడా భగ్నం చేయడానికి ప్రయత్నించగా పార్టీ కార్యకర్తలు ప్రతిఘటించారు. ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here