బిగ్ బాస్ 2 కంటెస్టంట్ బాబు గోగినేనిపై కేసు నమోదు

ప్రముఖ హేతువాది బాబు గోగినేని పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడరని.. అంతేకాదు.. ఇటీవల ఆయన కొన్ని ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి అధర్ నంబర్లను తీసుకున్నారు.. ఇది అభ్యంతర కరం అంటూ కెవి నారాయణ కోర్టును ఆశ్రయించారు.
బాబు గోగినేని సౌత్‌ ఏషియన్ హ్యూమనిస్ట్‌ పేరుతో ఇటీవల హైదరాబాద్‌, విశాఖ, బెంగళూరులో సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన వారి నుంచి ఆధార్‌ నెంబర్లు తీసుకున్నారు. వీటిని మలేషియా కంపెనీకి విక్రయించినట్టు కేవీ నారాయణ ఆరోపించారు. అలాగే సోషల్‌ మీడియాలో సౌదీ ఉగ్రవాద దేశమని బాబు గోగినేని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో ఆ దేశానికి, మనకు మధ్య సత్‌ సంబంధాలు దెబ్బతింటాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ మత గ్రంథాలను బాబు గోగినేని కించపరిచారని పిటిషనర్ పేర్కోన్నారు. దీంతో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో బాబు గోగినేని పై 13 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఐతే.. తమకు ఫిర్యాదు చేసిన కేవీ నారాయణ ఇంకా పూర్తి ఆధారాలను తమకు అందజేయలేదని… ఆధారాలు సమర్పించాక అప్పుడు బాబు గోగినేనిపై చర్యలు తీసుకుంటామని . సీఐ కళింగరావు చెప్పారు. ఐతే ఈ విషయం బిస్ బాస్ 2 హౌస్ లో ఉన్న బాబు గోనినేనికి తెలిసే అవకాశం లేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here