డిఎస్ తిరిగి సొంత గూటికి… కాంగ్రెస్ నేతలతో రహస్య మంతనాలు

ఎన్నికలు దగ్గరకి వస్తున్నాయి… రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.. ఇక తాజాగా నిజామాబాద్ జిల్లా రాజకీయం తాజాగా హట్ న్యూస్ అయ్యింది. కాంగ్రెస్ లో మంచి పదవులు అనుభవించిన డిఎస్… టిఆర్ఎస్ లోకి వెళ్ళారు.. కానీ అక్కడ తనకు సరైన ప్రాధాన్యం దక్కలేదని భావించిన ఆయన తిరిగి సొంత గూటికి చేరుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తన అనుచరులతో రెండు రోజుల క్రితం సమావేశం అయి.. అనంతరం కాంగెస్ పార్టీ నేత గులాం నబి ఆజాద్ తో రహస్య సమవేశం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనకు టిఆర్ ఎస్ నేతలకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. .. కనీసం నిజామాబాద్ జిల్లాలో జరిగే కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నేడో రేపో డిఎస్ కీలక నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తుండగా, ప్రస్తుతం ఆయన తన ఇంట్లో పెద్ద కుమారుడితో సమావేశమై, రాజకీయ భవిష్యత్తుపై చర్చలు సాగిస్తున్నారు. డీఎస్ ఇంటికి ఆయన అనుచరులు ఒక్కొక్కరుగా చేరుకుంటుండగా, ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. కాసేపట్లో అనుచరులతో మరోసారి మాట్లాడిన తరువాత డీఎస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here