ముంబైని వణికిస్తున్న వర్షం… నలుగురు మృతి

దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరాన్ని వర్షం వణికిస్తుంది. రోజుల తరబడి వాన దంచికోడుతుండడంతో.. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడానికి భయ పడుతున్నారు.
కేవలం ఒక్కరోజులోనే 231.4 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పరేల్, దాదర్, హిందుమాత, భైకళ, కింగ్‌ సర్కిల్‌ తదితర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. ముంబై, థానేలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలుచోట్ల భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరో 48గంటలు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది.

స్కూళ్లు, లోకల్ రైళ్లు చాలావరకు రద్దుచేశారు. రైలు పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. భిలాద్, సంజన్ మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. కొన్ని రైల్వే సర్వీసులను దారిమళ్లించారు. పశ్చిమ, సెంట్రల్, హార్బర్‌ 3 మార్గాల్లో లోకల్‌ రైళ్లన్నీ ఆలస్యంగా నడిచాయి. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చాలా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకురావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎప్పడికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here