తెలంగాణలో బడుగు బలహీనుల కోసం ఆవిర్భవించిన సరికొత్త రాజకీయ పార్టీ..!

తెలుగు రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితుల్లో రాజకీయం జరుగుతుంది.. ఓ వైపు ఏపీలో అధికార టిడిపి తో సై అంటే సై అంటూ పోటీలోకి వైసిపి, జనసేన పార్టీలు ఉండగా… తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ మినహా ప్రతి పక్ష పార్టీలు సోదిలో లేకుండా పోతున్నాయి.. ఓ మోస్తరుగా మాత్రమే కాంగ్రెస్ తన ఉనికి చాటుకునెందుకు పోరాటం సాగిస్తుంది. ఈ నేపధ్యంలో మరో కొత్త పార్టీ అవతరించింది. ఆ పార్టీ పేరు “ధమ్మ ప్రజా పార్టీ”… ఈ పార్టీ వ్యవస్థాపకుడు డా. మేడే శాంతి కుమార్ మాట్లాడుతూ… దేశంలో ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేసే పార్టీలు మాత్రమే ఆవిర్భవిస్తూ వచ్చాయి.. కానీ తమ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడడం కోసం ఆవిర్భించింది అని చెప్పారు. తమ పార్టీ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. త్వరలోనే పార్టీ విధివిధానాలను, మేనిఫెస్టోను వెల్లడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కార్యనిర్వాహక కార్యదర్శి నరసింహ, సంయుక్త కార్యదర్శి శ్యాంసుందర్, కోశాధికారి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here