పోకిరి రికార్డ్ ను బీట్ చేసిన రంగస్థలం

రామ్ చరణ్ సమంత సుకుమార్ కాంబినేషన్ లో 1985 గ్రామీణప్రాంత నేపథ్యంతో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఈ సంవత్సరంలో తొలి హిట్ ను అందుకుంది.. నాన్ బాహుబలి సినిమా రికార్డ్స్ న్ బద్దలు కొట్టిన రంగ స్తలం తాజాగా మరో రికార్డ్ ను బీట్ చేసింది. రంగస్థలం మూవీ హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం సినిమా హాల్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా నిలిచిన పోకిరి పేరిట ఈ రికార్డ్ ఉంది.. తాజాగా రంగస్థలం ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.

12 ఏళ్ల క్రితం విడుదలైన పోకిరి, సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో రూ.1,61,43,081 వసూలు చేసింది. ఇక రంగస్థలం విడుదలైన 89 రోజుల్లో రూ. 1.62 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే రామ్ చరణ్ ఇక నుంచి తన సినిమా కలెక్షన్ల వివరాలు బహిర్గతం చేయనని.. అది అభిమానుల వార్ కి దారితీస్తున్నదని చెప్పిన సంగతి తెలిసిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here