శేఖర్ కమ్ముల పేరుతో ఆన్ లైన్ లో మోసం…!

విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ శేఖర్ కమ్ములత్వరలో ఓ సినిమా తెరేకేక్కనున్నది అనే వార్తలు వినిపించాయి… దీనిని ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు అందినంత దండుకున్నారు. తాను శేఖర్‌ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ ని ఈ సినిమాకు నటీనటులు కావాలంటూ ఫేస్ న్యూస్ ఇచ్చాడు.. తన పేరుతో జరిగిన మోసం గురించి తెలుసుకున్న శేఖర్ కమ్ముల మంగళ వారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కొత్త సినిమాలో నటించడానికి యువతీయువకులు కావాలి అంటూ శేఖర్‌ పేరుతో నెల క్రితం క్వికర్‌ లో ఓ ప్రకటన వెలువడింది. సాధారణంగానే శేఖర్‌ కమ్ముల సినిమాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటారు. దీంతో ఈ ప్రకటన నిజమని నమ్మిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఆ పోస్ట్‌ లో ఉన్న నంబర్‌ను సంప్రదించారు.

ఫోన్లు రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి రూ.4 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించాడు. ముందుగా రూ.2 వేల వరకు తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయాలని, ఆపై ఈ జూన్ 25న ఫైనల్ ఇంటర్వ్యూ హైదరాబాద్‌ లో ఉంటుందని నమ్మబలికాడు. ఆ రోజు మిగిలిన మొత్తం చెల్లించాలని చెప్పాడు. దీనికి స్పందించిన వేలాది మంది మోసగాడు సూచించిన ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేశారు.

సోమవారం(25న) హైదరాబాద్ కి వచ్చి శేఖర్‌ కమ్ములను కలిశారు. మొదట డిపాజిట్‌ చేసింది పోగా మిగిలిన మొత్తం చెల్లిస్తానని, తనను ఇంటర్వ్యూ చేయాలని ఆయన్ను కోరారు. దీంతో అవాక్కైన శేఖర్‌ ఆరా తీయగా ప్రదీప్‌ అసలు విషయం చెప్పారు. అసలు విషయాన్ని తెలుసుకున్న కంగుతిన్న శేఖర్ కమ్ముల అది మోసపూరిత ప్రకటన అని, తనకు సంబంధం లేదని చెప్పిన సైబర్‌ క్రైమ్స్‌ అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. సైబర్ కేటుగాళ్లు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్, ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తి ఎవరన్న సంగతి తేల్చేందుకు రంగంలోకి దిగారు. ఇలాంటి ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని వారు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here