మోడీ, జైట్లిలకు లేఖ రాశా : విజయ్ మాల్య

బ్యాంక్ లకు రూ. 9000 వేళా కోట్లను ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయి.. ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్య తనపై వస్తున్నా ఆరోపణలు అవాస్తవాలని… ప్రభుత్వం తనపై తీసుకుంటున్న క్రిమినల్ చర్యలు తనని విసిగిస్తున్నాయని అన్నారు. తాను బ్యాంక్ ఋణం ఎగ్గోట్టినట్లు కొంతమంది రాజకీయ నాయకులు, మీడియా వర్గాలు తనని అనరని మాటలు అంటున్నారు. తప్పుడు ఆరోపణలతో ఈడీ, సీబీఐ చార్జ్‌ షీట్‌ దాఖలు చేశాయని మాల్యా విమర్శించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తనను ఎగవేతదారులకు పోస్టర్‌ బాయ్‌గా మార్చేశారని వాపోయారు. 2016 ఏప్రిల్‌ 15న ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ రాసినా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అలాగే సెటిల్‌మెంట్‌ కోసం తాను చేసిన రెండు ప్రతిపాదనలను బ్యాంకులు తిరస్కరించాయని గుర్తుచేశారు. బ్యాంకులతో సెటిల్‌మెంట్‌ చేసుకోవాలన్న తన ప్రయత్నాలు విఫలమైతే ఆ బాధ్యత తనది కాదన్నారు.. విజయ్‌ మాల్యా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here