అమ్మల కన్న అమ్మ కు మొక్కు చెల్లించిన కెసిఆర్

ఇంద్రకీలాద్రిపైనున్న బెజవాడ కనకదుర్గమ్మ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సకుటుంబసమేతంగా దర్శించి. తన మొక్కులు తీర్చోకొన్నారు.
అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ గన్నవరం విమానాశ్రయం చేరుకోగా, ఏపి మంత్రి దేవినేని వారికి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్‌ పరివారం నేరుగా ఇంద్రకీలాద్రికి రాగా, ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో లాంచనాలతో స్వాగతం పలికారు. కెసిఆర్ అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య ఆలయంలోనికి ప్రవేశించారు.


ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం, ముక్కపుడకను కనకదుర్గ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించగా, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. దీనిలో కేసీఆర్‌ సతీమణి, కోడలు, మనవలు, పలువురు బంధువులతో పాటు , తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్‌ను చూసేందుకు భక్తులు ఎగబడగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here