నిర్ణయం కేసిఆర్ దే.. తెరాస యమ్.పి డి శ్రీనివాస్

యమ్.పి డి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిన్న కవిత మరియు నిజామాబాదు తెరాసా యమ్.ఎల్.ఏ లు పలువురు లేఖాస్త్రం సంధిచిన విషయం తెలిసిందే. తెరాసా ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్‌ హోదా కల్పించి , ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి గౌరవిస్తే ‘వెనుకటి గుణమేల మాను వినరా సుమ’తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
దీంతో యమ్.పి డి శ్రీనివాస్ నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా కుదరలేదు. నేడు కెసిఆర్ బెజవాడ అమ్మ దర్శన అనంతరం హైదరాబాద్ సాయంత్రం రాగానే కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారం ఫై శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై కెసిఆర్ కు ఫిర్యాదు చేసే ముందు ఒక్కసారి తనతో మాట్లాడితే బాగుండే దన్నారు. తాను చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నన్నది అపోహ మాత్రమేనని, ఢిల్లీ వ్యక్తిగత పనుల విషయంలో కొంతమందిని కలవడం జరిగిందని, రాజకీయాలు లేవని వివరణ ఇచ్చారు.
పిర్యాదులు చేసుకోవచ్చని,దానికి తను కాక ఫిర్యాదు చేసిన వల్లనే వివరణ అడగాలని, ఐనా ‘నేతలు అన్నది ఫిర్యాదు మాత్రమే కదా.. నా గొంతు కోస్తామని చెప్పలేదు కదా’ అని డీఎస్‌ అన్నారు.
ఈ వ్యవహారంలో సియం కెసిఆర్ దే తుది నిర్ణయమని, అయన ఆదేశాలు పాటిస్తానని వివరణ లో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here