స్త్రీల కోసం లోటస్ చాక్లెట్ కంపెనీని స్థాపించిన సీనియర్ హీరోయిన్… ఎవరో తెలుసా..!

బాలనటి నుంచి హాస్యనటిగా వెండి తెరపై అడుగు పెట్టి.. అనంతరం ఏ పాత్రలోనైనా శారద జీవీస్తుంది.. అన్న పేరు సంపాదించుకుని ఆయా పాత్రలకే వన్నె తెచ్చిపెట్టిన కళా విశారద తెలుగు వారి ఆడపడుచు ఊర్వశి శారద. అచ్చ తెలుగు ఆడబడుచు.. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి.
1955లో కన్యాశుల్కం అనే సినిమాలో బాలనటిగా అరంగేట్రం చేశారు శారద. అనంతరం తెలుగులో హాస్య నటిగా అడుగు పెట్టి గుర్తింపు తెచ్చుకున్నా మలయాళం లో అనేక మంచి పాత్రలను పోషించి స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకున్నారు. 1969లో తులాబారం అనే మలయాళం చిత్రంలో ఆమె భర్తను కోల్పోయిన పాత్రలో నటించి ప్రేక్షకుల కంట తడి పెట్టించింది. తన నటనతో ఆ పాత్రకు జీవం పోసిన శారదకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు దక్కింది. దీనినే ఊర్వశి అవార్డు అని అంటారు. ఇక రెండో సారి 1972లో స్వయం వరం అనే మరో మలయాళీ చిత్రం ద్వారానే ఆమెకు జాతీయ అవార్డ్ వచ్చింది.
తర్వాత శారదకు అవకాశాలు వెల్లువెత్తాయి. నిర్మాతలకు కాల్షీట్స్ దొరకడమే చాలా కష్టమైపోయేంత బిజీ అయిపోయింది. అప్పట్లో అన్ని రకాల భావోద్వేగాలూ పలికించగల అరుదైన నటుల్లో ఒకరిగా టాప్ ప్లేస్ లో ఉంది శారద. మరోవైపు తన పాత్రలు, పరిస్థితులకు అనుగుణంగా వయసుకు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకుని వెండి తెరపై తనదైన ముద్ర వేశారు శారద.
శారద హీరోయిన్ గా నటించిన తెలుగు సినిమా తండ్రులు కొడుకులు లో తన సహనటుడు చలంతో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. కానీ ఎందుకో వీరిద్దరూ కొంత కాలం తర్వాత విడిపోయారు. అప్పట్లో నటుడు, నిర్మాతగా చలం బాగా పేరున్నవాడు..

మనుషులు మారాలి చిత్రంలో శారద నటన ఉన్నత శిఖరాలను చేరింది. ఆ చిత్రాన్నే మలయాళంలో తీసినప్పుడు ఆమెకు బహుమతులు వచ్చాయి. ఈ చిత్రం ఎన్ని భాషలలో తీస్తే అన్ని భాషలలోను ఆమే కథానాయికగా నటించింది. ఊర్వశి చిత్రంలో శారద కురూపిగా నటించిన తీరు అద్భుతం. ఆ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషమైతే, రాధమ్మ పెళ్లి చిత్రంలో తల్లీ కూతురుగా నటించడం మరో విశేషం.

తెలుగులో శారదకు జాతీయ అవార్డ్ తెచ్చిన చిత్రం నిమజ్జనం. అంతకుముందే మానవుడు దానవుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న శారదలోని నట విశ్వరూపాన్ని తెలుగు వారికి చూపించిన చిత్రం నిమజ్జనం. లైంగికదాడి బాధితురాలిగా శారద నటన అసమానం. భారతి పాత్రలో శారద అత్యున్నత నటనని ప్రదర్శించింది. లైంగిక దాడిని వ్యక్తిగత, మానసిక కోణంలోంచి చర్చించిన వాస్తవవాద సినిమా ’నిమజ్జనం’ తెలుగు చిత్ర చరిత్రలో ఓ మైలురాయి..

అక్క, అత్త, తల్లి, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, లాయర్ ఇలా ఏ పాత్రనైనా ఓన్ చేసుకుని నటించేవారు శారదా.. అమాయకురాలు, జీవితం, బలిపీఠం, మంగళ గౌరీ, స్వాతి, ప్రతిధ్వని, ముద్దాయి, శారదాంబ, చండశాసనుడు, మా తెలుగు తల్లి వంటి చిత్రాల్ శారద నటన తెలుగు సినీ రంగంలో చిర స్థాయిగా నిలిచిపోయారు. న్యాయం కావాలి చిత్రంలో జీవితంలో ఓడిపోయి తనలా మరో స్త్రీ జీవితం నాశనం కాకూడదనే ఆశయంతో లాయర్ పాత్రలో శారద నటన ఓహొ అనిపించుకుంది. అమ్మా రాజీనామాలో ఆమె నట విశ్వరూపాన్ని చూస్తున్న నేటి తరానికీ శారద అంటే ఎవరో తెలుసు అని చెప్పాల్సిన అవసరం లేదు..
90ల చివరి నుంచి శారద సినిమాలు తగ్గించుకుంది. ఎన్నో విలువలున్న ఆ కాలం సినిమాలకూ కేవలం వ్యాపార విలువలే ప్రధానంగా వస్తున్న ఈ కాలం సినిమాలకూ మధ్య ఇమడలేక తప్పుకున్నాను అంటారు.. 1996లో 11వ లోక్‌సభకు తెనాలి నియోజవర్గము నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికై ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.
సినిమాల్లో సాటి మహిళ కోసం పోరాడిన శారద.. నిజ జీవ జీవితంలో కూడా మహిళల సాధికారిత కోసం ఏమైనా చేయాలనీ భావించారు… పట్టణ స్త్రీలకు పని కల్పించే ఉద్దేశముతో లోటస్ చాక్‌లేట్ల వ్యాపారాన్ని ప్రారంభించారు.. కానీ ఈ ఫ్యాక్టరీ నష్టాలలో ఉండగా దీన్ని ఇతరులకు శారద అమ్మేశారు.. తాను రోజు రోజూ వ్యాపార వ్యవహారాలలో తలదూర్చలేదని కేవలం స్థాపకురాలినేనని చెప్పుకునే వారు శారద… అప్పట్లో సంప్రదాయాలను.. కట్టుబాట్లకు ఎదురు నిలిచి చరిత్రలో తనకంటూ ఓ స్థానం కల్పించుకున్న శారద.. నేటి మహిళలకు ఆదర్శం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here