శ్రీరెడ్డి కి వ్యతిరేకంగా మారుతున్న సామాజికవేత్తలు

శ్రీ రెడ్డి కి పరిస్థితులు ఎదురుతిరుగుతున్నయా..? వార్తల్లో నిలవడం కోసమో… లేక నేను ఏమన్నా చెల్లిపోతుందనే భావనతోనో… నిత్యం చేసే వివాదాస్పద వ్యాఖ్యలే.. ఆమెను అందరికీ దూరం చేస్తున్నాయా..? ఇలాంటి ఆలోచనలు… శ్రీ రెడ్డి సానుభూతిపరులు కూడా ఆమెకు వ్యతిరేకత ను తెలియజేస్తున్నారు. ఇటీవల చికాగో సెక్స్ రాకెట్ లో టాలీవుడ్ నటీనటులు అంటూ సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ శ్రీ రెడ్డిని ఈ స్థితిలో నిలబెట్టింది అంటున్నారు..

శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ లో ‘అమెరికాలో వీళ్ళు బాగా పెర్ఫామ్స్ చేస్తారు. అంటూ 36 మంది సెలబ్రిటీల పేర్లు బయటపెట్టింది. ఐతే ఈ సెక్స్ రాకెట్ వ్యవహారంలో బాధిత మహిళల పేర్లు బయటపెట్టకూడదు అని కొంత మంది సామాజిక వేత్తలు కోరుకుంటున్నారు.. కానీ శ్రీ రెడ్డి బయటపెట్టిన పేర్లతో ఆ మహిళలు… మానసిక క్షోభకు గురవుతున్నారు, తప్పు చేశారో లేదో తెలియక ముందు వారి వివరాలను బహిర్గతం చేయడం దారుణమైన విషయం అని… సామజిక వేత్తలు వాదిస్తున్నారు. అంతేకాదు… శ్రీ రెడ్డి పోరాటానికి బాసటగా నిలిచిన మహిళా సంఘం నేత సంధ్య సామాజిక జర్నలిస్టు సజయ కాకర్ల వంటి వారు… ఇప్పుడు శ్రీ రెడ్డి కి వ్యతిరేకులుగా మారినట్లు తెలుస్తుంది. సెక్స్ రాకెట్ విషయం లో బాధిత మహిళల విషయంలో మీడియా సైతం గోప్యత పాటించాలని ఒత్తిడి తెస్తుంటే… కానీ శ్రీ రెడ్డి చేసిన పనికి…. టాలీవుడ్ కి మరింత తలవంపులతో పాటు.. బాధిత మహిళలను బయటకు వెల్లడించి వారిని అవమానించింది. .. అంతేకాదు.. శ్రీ రెడ్డి సాటి ఆడవారి పట్ల జరుగుతున్న అన్యాయం పై పోరాడుతున్నా అంటూ…. “సెక్స్ రాకెట్ లో ఉన్న వారందరూ సాటి ఆడవాళ్ళన్న కనీస సానుభూతి కూడా లేకపోయింది.. అని సామజిక వేత్తలు సూటిగా ప్రశ్నిస్తున్నారు… మరి తన పోరాటం పై ఎవరైనా నెగిటివ్ గా కామెంట్ చేస్తే… విరుచుకు పడే శ్రీ రెడ్డి ఇప్పుడు సంధ్య వంటి వారి కామెంట్స్ కు ఏవిధంగా సమాధానం చెబుతుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here