మరోసారి నెత్తురోడిన సిరియా… 41 మంది మృతి, వందమందికి గాయాలు

మరో సారి అల్లర్లతో సిరియా నెత్తురోడింది. డేరా ప్రావిన్స్‌లో చెలరేగిన అల్లర్లులలో 41 మంది మృతి చెందారు. మరో వంద గాయపడ్డారు. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న డేరా ప్రావిన్స్‌ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా సిరియా బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి .వారిని అణచివేసేందుకు సిరియా బలగాలు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. బ్యారెల్‌ బాంబులు జారవిడిచి తిరుగుబాటుదారులపై సైన్యం దాడులకు పాల్పడుతుంది. ఈ దాడులో అమాయక పౌరులు కూడా మరణిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here