కొత్త డీజీపీ నియామకంపై చంద్రబాబు కసరత్తు పూర్తి

డిజిపి మాలకొండయ్య రిటైర్ కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కొత్త డీజీపీ నియామకంపై కసరత్తు పూర్తిచేసి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్నికలు మరికొద్ది నెలల్లో సమీపిస్తుండటంతో డీజీపీ బాధ్యతలు కీలకంగా మారాయి. దీంతో సమర్ధుడైన అధికారిని ఆ పోస్టులో నియమించాలని భావిస్తున్నారు. నిజానికి డీజీపీ పదవికి అర్హులైన ఏడుగురు ఐపీఎస్ లు ఉండగా వారిలో 1986 బ్యాచ్ కు చెందిన విఎస్ కె. కౌముది చాలా కాలం క్రితమే కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఐపీఎస్ అధికారులు ఎన్వీ సురేంద్ర బాబు., హోంశాఖ కార్యదర్శి ఏఆర్ అనురాధ కూడా డీజీపీ పదవికి అర్హులే అయినా వారిద్దరు ఆ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇక జైళ్ల శాఖ డీజీ వినయ్ రంజన్ రే ను అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో ఆయనపేరును పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఫైనల్ రేసులో సవాంగ్‌తో పోటీ పడుతున్న ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ పట్ల ప్రభుత్వం ప్రతికూల భావనతో ఉంది. బీజేపీ నేతలతో ఆయనకు ఉన్న సంబంధాలు కూడా నెగటీవ్ ఇంప్రెషన్ కు కారణమయ్యాయి.. ఈ పరిణామాలన్ని ఠాకూర్ కు మైనస్ అవగా…విజయవాడ సీపీగా సవాంగ్ సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించటంతో తర్వాత డీజీపీగా సవాంగ్ నియామకం ఖాయమని ఏపీసచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here