ఏపీ డీజీపీ మాలకొండయ్య రెండు రోజుల్లో పదవీవిరమణ… కొత్త డీజీపీపై ఉత్కంఠ

ఏపీ డీజీపీ డీజీపీ మాలకొండయ్య మరో రెండ్రోజుల్లో పదవీ విరమణ చేయనుండగా… ఆయన ప్లేస్‌లో ఎవరిని భర్తీ చేస్తారనే ఉత్కంఠ పెరిగిపోయింది. డీజీపీ రేసులో ఆర్పీ ఠాకూర్, సవాంగ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా… రేసులో సవాంగ్ చివరి వరకు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం నియామకాన్ని పూర్తి చేసేందుకు ఇన్ ఛార్జి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో సెర్చ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడేళ్లుగా విజయవాడ సీపీగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సవాంగ్ వైపే కమిటీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

2015లో విజయవాడ కమిషనర్‌గా ఛార్జ్‌ తీసుకున్న సవాంగ్ తనదైన స్టైల్‌లో దూసుకెళ్లారు… క్రైమ్‌రేట్‌ను కంట్రోల్‌ చేసేందుకు టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. చిన్నపాటి వివాదం కూడా లేకుండా.. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ.. శాంతిభద్రతలను కాపాడటమే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అమరావతి రాజధాని అయ్యాక.. విజయవాడలో పోలీస్‌ శాఖపై మరింత ఒత్తిడి పెరిగింది. వాటన్నింటినీ సమర్థంగా నిర్వహిస్తున్నారు సవాంగ్.. ఇవన్నీ ఆయనను డీజీపీగా ప్రమోట్ చేసేందుకు ప్లస్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here