తప్పుడు రివ్యూలతో ఫూల్ అవ్వడం ఆ బిజేపీ నేత హాబీ.. ఈసారి కేంద్రం చేతిలో ఫూల్.. ఎవరో తెలుసా..!

గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన బిజెపి నేత జివిఎల్ నరసింహ రావు.. అధికార పార్టీ నేతలపై.. సిఎం చంద్రబాబు పై చంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు..
ఎన్నికల సర్వేలు నిర్వహించడంలో, వ్యూహరచనలో ప్రావీణ్యం ఉన్న ఆయన మరో సారి ఫూల్ అయ్యారు.. ఐతే ఈ సరి కుటుంబ రావు చేతిలో కాదు.. తన సొంత పార్టీ నేతల చేతుల్లోనే…
అమరావతి యుసిల దగ్గర నుంచి పోలవరం మీద చెప్పే పిట్ట కధలు దాకా, ఈ జీవీఎల్ ఏమి చెప్పినా అబద్ధమే.. ప్రతి సారి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు జివిఎల్ ఏమి చెప్పినా అబద్దాలని రుజువు చేసేవారు.. కాగా ఈ సారి ఆ డ్యూటీ సొంత పార్టీ ప్రభుత్వం తీసుకుంది.. రెండు రోజుల క్రితం జీవీఎల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద నిర్మించే ఇళ్ల విషయంలో టిడిపి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని జి.వి.ఎల్ నరసింహరావు ఆరోపించారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,400 చొప్పున బిల్లులు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం పచ్చ చొక్కాల వారికే ఇళ్లు కేటాయిస్తున్నారని…పేదలు అడిగితే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇళ్ళ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, రెండు వేల కోట్ల కుంభకోణం జరిగింది అంటూ జివిఎల్ విమర్శించారు.అలా జీవీఎల్ ఆరోపణలు చేసాడో లేదో, ఇలా కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణాల పై ఒక అప్డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద జరుగుతున్న పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ తీరును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమీక్షించించి పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ మంచి పనితీరు కనబరుస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఇళ్ళ నిర్మాణాల్లో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉందని కితాబు ఇచ్చింది. ఎపీతో పాటు మధ్యప్రదేశ్‌, తెలంగాణా పై కూడా ప్రశంసలు కురిపించింది కేంద్రం. కేంద్రం కితాబుతో తెలుగు దేశం పార్టీ పై విమర్శలు చేస్తోన్న జీవీఎల్ ఫీజులు మరో సారి ఎగిరిపోయాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here