శ్రీవారి ఆభరణాల విషయం లో సిఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

గత కొన్ని రోజులుగా తిరుమల శ్రీవారి ఆభరణాల విషయం లో ఆరోపణలపై తెరదించడానికి ఏపీ సిఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టిటిడి బోర్డు సభ్యులుపాలక మండలి అన్ని ఆభరణాలు సరిగ్గానే ఉన్నాయని చెప్పినా ఆరోపణలు వినిపిస్తుండడంతో సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించి నిజాలను వేలితీయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను ప్రత్యేకంగా లేఖ రాశారు.

తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆభరణాలు మాయమయ్యాయంటూ.. పదవీ విరమణ చేసిన మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై ప్రతిపక్షాలు కూడా అనుమానాలు వ్యక్తం చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు సీఎం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆరాధ్యదైవం అయిన స్వామివారిని నగలు దొంగతనానికి గురైనట్లుగా కొంతమంది ఆరోపిస్తున్నారని, స్వార్థం, స్వప్రయోజనాల కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారన్న సీఎం.. సిట్టింగ్ న్యాయమూర్తితో దీనిపై సమగ్ర ధృవీకరణ జరిపించాలనికోరారు. ఆ నివేదికను బహిరంగంగా ప్రజల ముందు పెట్టి ఈ వివాదానికి ముగింపు పలకాలని సూచించారు. ఇదే సమయంలో స్వామి వారి కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయో లేదో కూడా పరిశీలించాలని లేఖలో కోరారు సీఎం చంద్రబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here