లోకేష్ ఈ రెండు జిల్లాల నుంచే పోటీఅట..!!

సిఎం చంద్రబాబు తనయుడు లోకేష్… ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగు పెట్టి.. ఐటి మంత్రిగా పదవి చేపట్టారు. కాగా తాను నెక్స్ట్ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి.. ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ప్రకటించాడు లోకేష్.. కానీ ఎక్కడనుంచి పోటీ చేయనున్నది అనే విషయం తండ్రి చేతిలోనే పెట్టాడు.. కాగా ప్రసుత్తం ఈ వార్తలు హాట్ హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాయి.

లోకేష్ హిందూపురం నుంచి పోటీలోకి దిగనున్నారు అనే ప్రచారం వినిపించినా…. ఈసారి కూడా బాలకృష్ణ తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని యువనేత ప్రకటించడం తో ఆ వార్తలకు ఫుల్ స్టాఫ్ పడింది.. అనంతరం పలమనేరు నుంచి గానీ టిడిపి బలంగా ఉన్న కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి కానీ లోకేష్ పోటీ చేయవచ్చు అనే వార్తలు మళ్ళీ వినిపిస్తున్నాయి. ఈ రెండు నియోజక వర్గాల నుంచి కాకపోయినా టిడిపికి కంచుకోటలైన అనంతపురం. కృష్ణా జిల్లాల నుంచే లోకేష్ పోటీ అని తెలుస్తోంది. అయితే లోకేష్ కోరుకుంటే.. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాలనుంచి తప్పుకుని లోకేష్ కు అవకాశం ఇవ్వడానికి వారు సిద్ధం అని అంటున్నారు.. అయితే లోకేష్ పోటీ విషయం పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన చేసే వరకూ ఇటువంటి ప్రకటనలు… ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here