మైఖేల్ జాక్సన్ తండ్రి జోయా జాక్సన్ మృతి

రాక్ డ్యాన్సర్.. పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ తండ్రి జోయా జాక్సన్ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పాంక్రియాటిక్ కేన్సర్ తో బాధపడుతున్నారు. బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు జోయా జాక్సన్ మనవళ్ళు రాండీ జాక్సన్‌ జూనియర్‌, టై జాక్సన్‌లు ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేశారు.
జోయ్ జాక్స‌న్ 1928 జూలై 26న అమెరికాలోని అర్కన్‌సస్‌లోని ఫౌంటెన్‌హిల్స్‌లో జన్మించారు. ఆయన భార్య పేరు కేథరిన్ (88) . వీరికి 11 మంది సంతానం కాగా, పుట్టగానే ఓ బిడ్డ చనిపోయారు. మైకేల్‌ జాక్సన్‌ 8వ సంతానం… మైఖేల్ జాక్సన్ మేనేజర్ గా వ్యవహరిస్తూ… తన తనయుడిని ఎంతో ఉన్నత స్థితికి తీసుకుని వెళ్లారు.. జోయా జాక్సన్ మృతి తో కుటుంబ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలియజేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here