పల్లె బాట పట్టిన బాలయ్య… తండాల్లోనే నిద్ర

సిని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజక వర్గంలో సందడి చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు చిలమత్తూరు మండలంను పర్యటించారు. చాగలేరు ఎస్సీ కాలనీలో స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన పక్కనే కూర్చున్న మహిళలకు ఆప్యాయంగా పాయసాన్ని తినిపించారు. కోడూరు పంచాయతీలోని దిగువపల్లి తండాలో పల్లె నిద్ర చేశారు.
సోమగట్ట, పలగలపల్లి, చాగలేరు, కోడికొండ, కోడూరు పంచాయతీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు బాలకృష్ణ. ప్రతీ గ్రామంలోనూ అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఇవాళ ఏరువాక కార్యక్రమంలో పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here