థంబ్ నైల్స్ కోసమా నా పెళ్లి వార్తలు.. మీడియా పై మండిపడ్డ నీహారిక

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నీహారిక పెళ్లి వార్తలు మీడియాలో చేస్తూ సంచలనం సృష్టిస్తూనే ఉంటాయి.. కాగా ఇటీవల నీహారిక వద్దకు ఓ వ్యక్తి వెళ్లి.. మేడమ్ మేము యూ ట్యూబ్ చానల్ నుంచి వచ్చాం… మీ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ విషయం గురించి మీరు ఏమైనా చెబుతారా అని అడగగా…. నిహారిక స్పందిస్తూ… అసలు ఎవరయ్యా వీళ్ళను లోపలికి రానిచ్చింది…. నా పెళ్లి గురించి మీకేండుకయ్యా..? నీహారిక ఎవరిని పెళ్లి చేసుకుంటుంది.. ఎప్పుడు చేసుకుంటుంది..? ఎందుకు చేసుకుంటుంది.. చూస్తె షాక్ అవుతారు..? షేక్ అవుతారు కిందపడి లేస్తారు.. పిచ్చా మీకేమైనా మీ థంబ్ నైల్స్ కోసం నన్ను వాడుకుంటారా..? అని ఫైర్ అయిన విడియో… ను యువి క్రియేషన్స్ యూట్యూబ్ లో షేర్ చేసింది.. అయితే.. రిపోర్ట్ నీహారిక ఫైర్ అవ్వడం చూసి.. మేడం మేము అడిగేది… మీ నిజ జీవితంలో పెళ్లి గురించి కాదు… హ్యాపీ వెడ్డింగ్ సినిమా గురించి అనగానే… నీహారిక సారీ సారీ సారీ మళ్ళీ మళ్ళీ ఓకేనా ..? హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్ ఈ నెల 30 న రిలీజ్ కానున్నది.. అదే రోజున రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తాం అని బై చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయింది.. ఇది సినిమా ప్రమోషన్ కోసం డిఫరెంట్ గా క్రియేట్ చేసిన ప్రమోషన్ వీడియో … యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నీహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here