కాస్టింగ్ కౌచ్ పోరాటం పై శ్రీ రెడ్డి దుమ్ము దులిపిన పవిత్ర లోకేష్

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి… గత కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న పవిత్ర లోకేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తి కరమైన విషయాలను చెప్పింది.. టాలీవుడ్ ని కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ పై … శ్రీ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలపై ఆమె చేస్తోన్న పోరాటం పై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది…
పవిత్ర లోకేష్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది. ‘‘కాస్టింగ్ కౌచ్ అంశం అనేది చాలా సున్నితమైనది.. ఈ విశ్వంలో ఆడ – మగ అనే రెండే జాతులున్నాయి. ఆడవాళ్లు మగవాళ్లని.. మగవాళ్లు ఆడవాళ్లను ఉపయోగించుకోవడం అనేది అన్ని రంగాల్లో ఉంది. అదే ప్రకృతి ధర్మం’ అని కుండబద్దలు కొట్టింది.

‘మన బతకడానికి డబ్బు అవసరం . అధికమొత్తంలో డబ్బు కావాలని భావిస్తే అదే స్థాయిలో ఇతర పనులు కూడా చేయాలి. ఆ పనిచేసే ముందు ఎందుకు చేస్తున్నాం అని ఆలోచించాలి. అంగీకరించి ఆ పనిచేస్తే అది మన సమస్య మాత్రమే అవుతుంది. అంటూనే… నా దృష్టిలో ‘కాస్టింగ్ కౌచ్ అనేది చాలా పెద్ద పేరు. ఇటీవల ఎక్కడ చూసినా 4 – 5 ఏళ్ల చిన్నారులు రేప్ కు గురవుతున్నారు. ఇది అసలు పెద్ద విషయం . ఎవరైనా మాట్లాడితే ఈ చిన్న పిల్లల దారుణాలపై మాట్లాడండి.. కాస్టింగ్ కౌచ్ పై కాదు’ అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది పవిత్ర లోకేష్..

‘పరిణతి చెందిన ఇద్దరు ఆడ – మగ ఇష్టపడి గడిపి… అనంతరం తమకు అన్యాయం జరిగిందని రచ్చ చేయడం ఎందుకు..? ఇటువంటి రచ్చ చేస్తున్న వారంతా
ఊహతెలియని చిన్న పాపలు కాదు.. కదా..! తమకు కావలసింది ఇది అంటూ ఆశించి ఈ పనికి ఒప్పుకుని… మళ్ళీ కొంత కాలం తర్వాత వారే మళ్లీ కాస్టింగ్ కౌచ్ అంటూ మాట్లాడుతూ…. తామే అన్యాయం పోరాటం చేస్తున్నాం అంటూ… గేమ్స్ ఆడుతున్నారు. ఆడ మగ మధ్య జరుగుతున్న విషయానికి అగ్రిమెంట్ ప్రకారం అంగీకరిస్తున్నారు. అసలు అంత ఇష్టం లేకపోతె… తాము అటువంటి వాటిని అంగీకరించం.. అని ఈ విషయాన్ని ఖండిస్తూ… మొదట్లోనే నో చెప్పే చాయిస్ ఉంది. కానీ అప్పుడు ఎందుకు అలా చేయడం లేదు. తమకు నచ్చినంత కాలం ఇష్టం ఉన్నంతకాలం తిరిగి.. ఇప్పుడు బయటకు వచ్చి వాడుకున్నారు అని గోల చేస్తే ఎలా ” పవిత్ర లోకేష్ మండిపడింది. ఈ ఇంటర్వ్యు లో శ్రీరెడ్డిపై పరోక్షంగా సెటైర్లు పేల్చింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో సంచలన విషయాలను వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here