ఫిఫా 2018 ప్రపంచకప్ అసలు ఆట మొదలైంది…

ఎన్నో ఆశలు. అంచనాలతో బరిలో దిగిన ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాలకు గ్రూప్ దశ పోటీల్లో చుక్కలు కనిపించాయు. ఎన్నో సంచలనాలు. మరెన్నో నాటకీయ పరిణామాలు మధ్య . ప్రపంచకప్‌లోమొదటిదశ ముగిసింది. మొత్తం 8 గ్రూపుల్లో ఒక్కో గ్రూప్ నుంచీ 2 జట్లు అంటే మొత్తం 16 దేశాల జట్లు నాక్అవుట్ దశకు చేరుకొన్నాయు. ఈదశలో ఓడిపోతే ఇక ఇంటికి పోవాల్సిందే.
నమ్మశక్యం కాని విధంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఐన జర్మనీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అర్జెంటీనా అతికష్టం మీద నాక్అవుట్ దశకు వచ్చింది. టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన స్పెయిన్‌, బ్రెజిల్‌లూ తమ స్థాయిలో ఆధిపత్యాన్ని చూపించలేకపోయాయి.సునాయాసంగా నాకౌట్‌ దశకు చేరుతుందనుకున్న పోలెండ్‌ బొక్కబోర్లా పడితే.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ జపాన్‌ ఏకైక ఆసియాఖండ జట్టుగా బరిలో దూసుకెళ్లింది. క్రొయేషియా, స్వీడన్‌లు తమ గ్రూపుల్లో అగ్రస్థానం సాదిచాయు. ఇక ఆఫ్రికా ఖండం నుంచి ఒక్కటీ నాక్అవుట్ దశకు చేరలేదు.
ఇక ఒక రోజు విరామం తర్వాత శనివారం 16 జట్లతో కూడిన నాకౌట్‌ పోరు మొదలు కానుంది. ఈ 8 మ్యాచ్తొలలో విజేతలు క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెడతారు. మొదటి మ్యాచ్‌లో మాజీ ప్రపంచ విజేతలు ఫ్రాన్స్‌, అర్జెంటీనా ఢీకొంటాయి. అదే రోజు ఉరుగ్వేతో పోర్చుగల్‌ తలపడుతుంది. రసవత్తర పోరు ఖాయం. ఐదుసార్లు ఛాంపియన్‌ బ్రెజిల్‌ క్వార్టర్‌ఫైనల్లో స్థానం కోసం మెక్సికో తో తలపడుతుంది. ఈ రెండో దశ పోటీల్లో ఉరుగ్వే, క్రొయేషియా, కొలంబియా ల నుంచీ మరిన్ని సంచలనాలను అసించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here