తండా వాసులతో బాలయ్య డ్యాన్స్..!

సిని హీరో.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ౩ రోజుల అనంతపురం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజు… తండా వాసులతో.. భోజనం చేసి.. అక్కడే నిద్రించిన బాలయ్య.. నిన్న ఏరువాక సందర్భంగా పొలంలోకి దిగి అరక దున్నారు… ఇక ఈ రోజు తండా వాసులతో కలిసి డ్యాన్స్ చేశారు.. పల్లెబాట పట్టిన బాలయ్య… 3వ రోజున చిలమత్తూరు మండలంలో బాలయ్య పర్యటించారు. ఆయనకు అదెపల్లి తండాలో స్థానికులు ఎమ్మెల్యేకు సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. ఇది చూసి బాలయ్యకు కూడా ఊపు వచ్చింది. వాళ్లతో కలిసి పాదం కలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here