సిఎం కేసీఆర్ గా నాజర్

తెలంగాణ సిఎం చంద్రశేఖర్ జీవితాధరంగా ఓ సినిమా తెరకేక్కనున్నది. ఈ సినిమాకు ఉద్యమ సింహం అనే టైటిల్ ఖరారు చేస్తూ.. గురువారం రోజున పూజా కార్యక్రమం జరుపుకుంది. కాగా వెండి తెరపై కేసీఆర్ గా ప్రముఖ నటుడు నాజర్ నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ… నేను ఇప్పటి వరకూ 500 సినిమాలు చేశాను.. కానీ ఉద్యమ సింహం వంటి సినిమాను తొలి సినిమాగా భావిస్తున్నా అని చెప్పారు. ఇప్పటి వరకూ ఉహత్మక పాత్రల్లో నటించిన నేను… ఒక గొప్ప రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నా.. ఈ సినిమాలో కెసిఆర్ పాత్రకు నన్ను ఎంపిక చేసిన చిత్ర యూనిట్ కి కృతఙ్ఞతలు చెబుతున్నా అని నాజర్ చెప్పారు. నేను కేసీఆర్ సంబంధించిన ప్రసంగాలను, వీడియోలను ఇప్పటికే యూ ట్యూబ్ లో చూశా… సిఎం కేసీఆర్ గా నటిస్తునందుకు కొంచెం టెన్షన్ గా ఉంది.. అని చెప్పారు.. నవంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణం రాజు దర్శకత్వం వహిస్తున్నారు. కె. నాగేశ్వర రావు నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here