నేను రహస్యం బయట పెడితే… పవన్ ఫ్యాన్స్ పొగరు దిగిపోతుంది: రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ నుంచి రేణు దేశాయ్ విడిపోయినా… అభిమానుల దృష్టిలో ఆమె వదినమ్మే… విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్… పూణే లో పిల్లలు అకిరా, ఆద్యలతో కలిసి ఒంటరిగా గత ఏడేళ్ళుగా జీవిస్తుంది.. కాగా గత కొంత కాలం నుంచి తన రెండో పెళ్లి ఇంట్స్ ఇస్తూ.. అందరినీ ముందే ప్రిపేర్ చేస్తూ వచ్చిన రేణు దేశాయ్.. తనకు ఒక తోడూ దొరికాడు… అతనికి నేను అంటే చాల ఇష్టం.. నా లైఫ్ కి భద్రత ఇచ్చే వ్యక్తీ అంటూ.. ఓ వ్యక్తీ చేతులు… తన చేతులను పట్టుకుని ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది.. అనంతరం తన నిశ్చితార్ధం ఫోటోలను పెట్టి.. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రెండు పెళ్లి పై పవన్ కళ్యాణ్ విసెష్ చెప్పి స్వాగతించినా పవన్ అభిమానులం అంటూ కొంత మంది అభిమానులు విమర్శలు చేస్తుండగా… మరికొంత మంది స్వాగతిస్తున్నారు.

కొంత మంది వ్యక్తులు మాత్రం.. దేశంలో జరిగే అతి పెద్ద విషాద ఘటన రేణు దేశాయ్ పెళ్లి అనంత ఇదిగా.. తమ కుటుంబ విషయాలను పక్కకు పెట్టిమరీ బాధపడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలకు రెండు దేశాయ్ కూడా అంతే ఘాటుగా సమాధానం చెబుతుంది.ఓ అభిమాని పేరుతో ఓ వ్యక్తీ చేసిన కామెంట్ కు విడాకుల గురించి ఇన్నాళ్లూ తాను మౌనంగా ఉన్నందుకు పవన్‌ అభిమానులు తనకి రుణపడి ఉండాలనీ… ఒకవేళ తాను కనుక నోరు తెరిచి విడాకులకి దారితీసిన కారణాలు చెబితే వాళ్ల పొగరంతా దిగిపోతుందనీ’ హెచ్చరించింది.

మీ పెళ్లికి అన్నయ్య వస్తారా అని అడిగితే.. రేణూ ఆయన్నే అడగండి అని అంటోంది. పెళ్లి చేసుకోవద్దు.. మళ్లీ మనం కలిసుందాం అని అడిగితే మీరేం సమాధానం చెబుతారు అంటే..నిజంగా మీకు హాట్సాఫ్.. మీకు భారత రత్న ఇవ్వాలి అని సమాధానం చెప్పింది. మీ పిల్లల గురించే మా బాధంతా అంటే.. ముందు మీ పిల్లల గురించి ఆలోచించుకోండి. నా పిల్లలకు తల్లి, తండ్రి, బాబాయ్, పెదనాన్న, పెద్దమ్మ.. అందరూ ఉన్నారు. మీరస్సలు వారిగురించి ఆలోచించక్కర్లేదు.

మరో ప్రశ్న సంధిస్తూ నాన్న పవన్ కంటే ఎత్తు ఎదిగిన అకీరా సినిమాల్లోకి వస్తాడా అంటే.. వాడికసలు యాక్టింగ్ ఇష్టంలేదు అని ఖచ్చితంగా చెప్పేసింది. మీరు పెళ్లి చేసుకుంటానంటే మాకు బాధగా ఉంది అని అంటే దానికి రేణూ మీకెందుకండీ బాధ. నేనేమీ మీ అమ్మాయిని కాదు కదా. అయినా సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ గురించి ఇంతగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అంటూ సున్నితంగా మందలించింది.
మరి ఈ సమాధానంతో అభిమానులు ఊరుకుంటారా..! లేక ఇంకా చెలరేగిపోతారా. ఇంతకీ రేణుదేశాయ్‌ ఇన్నాళ్లూ మౌనంగా ఉంచిన విషయాలు ఏంటి? అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here