రివ్యూ: యూత్ ని ఆకట్టుకొనే ‘ఈ నగరానికి ఏమైంది’?

రివ్యూ: ఈ నగరానికి ఏమైంది..?
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్
తారాగణం: విశ్వక్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభివన్ గోమతం, వెంకటేష్ కాకుమాను, అనిషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్
విడుదల తేది: 29-06-2018
షార్ట్స్ ఫిల్మ్స్ నుంచి పెళ్లి చూపులు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టి… మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు సినిమాతో తన ప్రతిభతో విమర్శకుల ప్రశంసలతో పాటు.. అనేక అవార్డులను కూడా అందుకున్నాడు.. తాజాగా ఈ నగరానికి ఏమైంది అనే ఆసక్తి కరమైన టైటిల్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తరుణ్.. ట్రైలర్ లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది ?

కథ: వివేక్ (విశ్వక్సేన్ నాయుడు), కార్తీక్ (సుశాంత్ రెడ్డి) కౌశిక్ (అభివన్ గోమతం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను) నలుగురు స్నేహితుల కథ… షార్ట్ ఫిల్మ్ తీసి తమ ప్రతిభను ప్రపంచానికి చూపించాలని నలుగురు స్నేహితులు భావిస్తారు. అయితే వివేక్ కు కోపం ఎక్కువ.. తన కోపాన్ని తను అదుపులో ఉంచుకోలేదు… పైగా లవ్ ఫెయిల్యూర్. దీంతో ఈ స్నేహితుల మధ్య తరచుగా గొడవలు చేసుకుంటాయి. ఇక కార్తీక్ జీవితంలో సెటిల్ అయ్యి.. పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.. ఓ పార్టీకి తన స్నేహితులను పిలుస్తాడు.. పబ్ లో చిత్తుగా తాగిన ఈ నలుగురు… మత్తులో గోవాకి చేరుకుంటారు. అక్కడ వెళ్ళాక… ఆ నలుగురు ఏమి చేశారు..? తమ స్నేహాన్ని… తమ జీవితాలను ఏ విధంగా గాడిలో పెట్టుకున్నారు… చిన్న తగాదాలు, కోపాలు, అల్లర్ల మధ్య ఎలా ఈ నలుగురు యువకుల జీవితం తీరం చేరుకుంది… అనేది వెండి తెరపై చూడాల్సిందే..!
విశ్లేషణ: పెళ్లి చూపులు సినిమాతో చిన్న సినిమాలో పెద్ద సినిమాగా పేరు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. రొటీన్ కథను… అత్యంత ఆసక్తి కరంగా… సహజంగా తీర్చిదిద్ది… ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. తన రెండో సినిమా ను కూడా అదే విధంగా తీశాడు.. ఈ నగరానికి ఏమైంది..? లో కథ ఏమీ ఉండదు… కేవలం నలుగురు స్నేహితుల ప్రయాణం మాత్రమే.. దానిని యువతకు నచ్చేలా ఆకట్టుకొనేలా సహజంగా ఉండేలా తెరకెక్కించాడు.. స్నేహితుల మధ్య ఉండే భావాలను పలికించాడు.. వివేక్ యాటిట్యూడ్, కార్తీక్ సిన్సియారిటీ, కౌశిక్ నవ్వులు, ఉప్రేంద్ర అమాయకత్వం.. ఒక్కొక్క పాత్రకు ఒక్కక్క షెడ్ ఇచ్చి… వాటితోనే యూత్ ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఏ సన్నివేశంలోనూ సినిమా టిక్ అనిపించదు.. వారు మాట్లాడుకుంటుంటే.. మనం మన స్నేహితులతో కలిసి ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. మాటలు.. సహజత్వం తో ఉండి.. సన్నివేశాలు నిలబడ్డాయి. అయితే గోవా వెళ్ళిన తర్వాత సినిమా జర్నీ టర్న్ తీసుకుంది.. ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ కోసం చేసే ప్రయత్నాలు సాగాదీసినల్టు ఉండి.. ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారాయి.. కొన్ని కొన్ని సన్నివేశాలను మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు… ఇక ముంగింపు కూడా అత్యంత సహజంగా ముగించాడు. అయితే పాత్రలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం.. కథలో బలం లేకపోవడం….. ప్రధాన పాత్రలో అర్జున్ రెడ్డి ఛాయలు కనిపించడం కొద్దిగా నిరాశను కలిగిస్తాయి. ఈ సినిమా యూత్ అని ఆకట్టుకోవాలి అనే దృష్టితో తీసినల్టు అనిపిస్తుంది.
అయితే తన పాత్రల్లో ఒదిగిపోయే నటీనటులను ఎంచుకొని సగం విజయం సొంతం చేసుకున్నాడు.. కొత్తవారిన యువకులు మంచి నటన కనబరిచారు. వివేక్ సాగర్ సంగీతం మరోసారి ఆకట్టుకుంది. రచయితగా మరో సారి అందరినీ తరుణ్ భాస్కర్ ఆకట్టుకున్నాడు.. కానీ కథలో లోపం కనిపించింది. ఇక బ్యానర్ సురేష్ ప్రొడక్షన్ నిర్మాణపు విలువల గురించి ప్రస్తావించాల్సిన పనిలేదు…… చిన్న సినిమాకైనా కథకి అనుగుణంగా అన్ని వనరులను సమకూరుస్తుంది..
ప్లస్ పాయింట్స్: సంభాషణలు, నటీనటుల నటన, యూత్ ని ఆకట్టుకునే సన్నివేశాలు
మైనస్ పాయింట్స్: కథ లేకపోవడం, తాగుబోతు సన్నివేశాలు ఎక్కువ అవ్వడం

చివరిగా యూత్ ని ఆకట్టుకొనే ఈ నగరానికి ఏమైంది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here