చంద్రబాబు సేంద్రీయ వ్యవసాయంపై న్యూ యార్క్ టైమ్స్ ప్రశంసల వర్షం

ఏపీ సిఎం చంద్రబాబు సేంద్రీయ వ్యవసాయం కోసం తీసుకున్న చర్యలపై పర్యావరణ వేత్తలు జే కొడుతున్నారు. రసాయన ఎరువులతో కృతిమ వ్యవసాయం వద్దని… ప్రకృతి సిద్ధం చేసే వ్యవసాయం ముద్దని రైతులను ప్రోత్సహించే దిశగా జోరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ను ఏర్పాటు చేశారు. దీనిపై తాజాగా న్యూ యార్క్ టైమ్స్ లో ప్రత్యేక కథనం వచ్చింది.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు పై ఈ పత్రిక పొగడ్తల వర్షం కురిపించింది.
రైతులు వాడే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు… తో ఎక్కువ దిగుబడి ఎలా ఉన్నా.. పర్యావరణం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. ఈ రసాయనిక ఎరువులు రైతుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపడమే కాదు… ఎక్కువ ధరతో వ్యవసాయం భారంగా మారింది.. దీంతో రైతుల పరిస్థితి మార్చాలని భావించిన చంద్రబాబు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపారు.
అందుకని సుభాష్ పాలేకర్ సూచనలతో జోరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు శ్రీకారం చుట్టారు. రైతును సాధికార సమితి సాయంతో సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళించారు. చంద్రబాబు రైతుల కోసం చేస్తున్న కృషిని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ప్రత్యెక కథనం ప్రచురించింది. దేశంలోనే ఏపీ మొట్టమొదటి జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ రాష్ట్రం అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.. ఇప్పుడు న్యూ యార్క్ టైమ్స్ లో చంద్రబాబు సేంద్రీయ వ్యవసయం విధానం పై ప్రత్యెక కథనం ప్రచురించింది.
ఇలా సేద్యం చేయడం కోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ. 2500 కోట్లను వేచ్చిస్తోందని ఆ కథనంలో ఉంది.
ఇక నుంచి రైతులు అప్పులు పాలు కారని… ఈ జీరో బడ్జెట్ విధానంతో సుమారు లక్ష మంది రైతులు వ్యవసాయం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది చివరికి వీరి సంఖ్య 5 లక్షలు పెరిగేలా.. మరో ఐదేళ్ళలో సుమారు 60లక్షల మంది పెరిగేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టినల్టు న్యూయార్క్ టైమ్స్ తన కథనం లో తెలియజేసింది.
అంతేకాదు.. ఏపీ అనుచరిస్తున్న జోరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ మిగిలిన రాష్ట్రాలు కూడా అనుసరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం ఏపీ బాటలో సేద్యం చేసేందుకు రెడీ అయ్యింది. పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. మొత్తంగా చంద్రబాబు రైతుల శ్రేయస్సు… పర్యావరణం హితం కోసం తీసుకున్న చర్యలతో…. మిగతా రాష్ట్రాలు అనుచరించడానికి మేము సైతం అంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here