సిఎం రమేష్ దీక్ష విరమణ.. చంద్రబాబు కేంద్రం పై ఫైర్

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సిఎం రమేష్ చేస్తోన్న నిరాహార దీక్ష 11రోజుకు చేరుకుంది. దీంతో ఆయన్ని శనివారం చంద్రబాబు నాయుడు, లోకేష్ లు పరామర్శించారు. సిఎం చంద్రబాబు పరామర్శించడానికి రావడంతో దీక్షతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని పార్టీ నేతలు దీక్షాస్థలికి తీసుకొచ్చారు. రవిని కూడా సీఎం పరామర్శించారు. చంద్రబాబు తన ప్రసంగం ముగించిన అనంతరం సీఎం రమేష్‌కు నిమ్మరసం తాగించి ఆమరణ దీక్ష విరమింపజేశారు. దీంతో 11రోజులుగా దీక్ష చేస్తున్న సీఎం రమేష్ తన దీక్షను విరమించుకున్నట్లయింది. ఎమ్మెల్సీ బీటెక్ రవికి కూడా చంద్రబాబు నిమ్మరసం తాగించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక ఎంపీ ఆమరణ దీక్ష చేస్తుంటే పట్టించుకోరా? అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం దిగివచ్చే పరిస్థితులు తీసుకొస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here