అబిడ్స్ ఆర్ఎస్ బ్రదర్స్ లో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం

హైదరాబాద్ లోని అబిడ్స్ ప్రాంతంలో ఉన్న ఆర్ ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణం లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

అగ్ని కీలకల్లో దుకాణం చిక్కుకోవడంతో వస్త్రాలన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. విద్యత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుంది అని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి పది గంటలకు దుకాణం మూసివేసి సిబ్బంది వెళ్లిపోయాక ఈ ఘటన జరిగింది. ముందు కింది అంతస్తులోని లిఫ్ట్‌‌ నుంచి పొగలు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షుల కధనం. ఆస్తి నష్టం కోట్లలోనే ఉంటుందని దుకాణ యజమానులు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here