పసికూన ఐర్లాండ్ పై 143పరుగుల తేడాతో భారత్ విజయం.. సిరీస్ సొంతం

టి 20 సిరీస్ లో పసికూన ఐర్లాండ్ తో భారత్ తలపడి… రికార్డ్ స్థాయిలో విజయం సొంతం చేసుకుంది. డబ్లిన్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా 143 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌.. 12.3 ఓవర్లలో 70 పరుగులకే చాప చుట్టేసింది. చాహల్‌, కుల్దీప్‌లు స్పిన్‌ మాయాజాలానికి ఐర్లాండ్‌ బ్యాట్స్‌మెన్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. చాహల్, కులదీప్ లకు చెరో 3 వికెట్లు దక్కగా… ఉమేశ్‌ యాదవ్‌కు 2, కౌల్‌, హార్దిక్‌ పాండ్యాలకు చెరో వికెట్‌ దక్కింది.

టాస్ గెలిచినా ఐర్లాండ్ ముందుగా ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఐర్లాండ్‌కు భారీ స్కోరు నిర్దేశించింది. కేఎల్‌ రాహుల్‌, సురేష్‌ రైనా చెలరేగిపోవడంతో.. 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 213 పరుగులు చేసింది. రాహుల్‌, రైనా హాఫ్‌ సెంచరీలతో విజృంభించగా.. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా 9 బంతుల్లో 32 పరుగులతో చెలరేగాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో ఒబ్రెయిన్‌ 3, చేజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. రాహుల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, చాహల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here