కబడ్డీ మాస్టర్స్ టోర్నమెంట్ ఫైనల్ లో భారత్

కబడ్డీ లో మనదేశానికి ఎదురేలేదు అని మరో సారి భారత్ జట్టు నిరూపించింది. భారత్ ఆరు దేశాల కబడ్డీ మాస్టర్స్ టోర్నమెంట్ లో ప్రపంచ చాంపియన్ భారత్ విజయ యాత్ర కొనసాగుతుంది. అపజయమే లేకుండా దూసుకెళ్తున్న అజయ్ ఠాకూర్ సేన శుక్రవారం జరిగిన రెండో సెమి ఫైనల్ లో 36-20 తేడాతో దక్షిణాఫ్రికా ను ఓడించింది. ఫైనల్ కు చేరుకుంది.
అజయ్‌ ఠాకూర్‌, మోను గోయత్‌ చక్కటి ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌ 10 రైడ్‌ పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెన్స్‌లో గిరీశ్‌ ఆకట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here