2050నాటికి ప్రపంచంతోనే పోటీ పడే స్థాయికి ఏపీ ఎదుగుతుంది:

ఇప్పటికే ఏపీ లో రెండు అతి పెద్ద కంపెనీలను పెట్టడానికి రెడీ అవుతున్నాయి. అయితే.. ఏపీలో మరిన్ని కంపెనీలను పెట్టి.. ఉద్యోగాల కల్పనకు మంత్రి నారా లోకేష్ వివిధ కంపెనీల సిఈవోలతో భేటీ అయ్యారు. గుంటూరులోని ఎమ్‌ఆర్‌పి టవర్స్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై లోకేష్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ.. రాజధాని లేకుండా ప్రయాణం చేస్తున్నామని… ఎన్ని సమస్యలు ఉన్నా కేవలం నాలుగేళ్లలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని లోకేష్‌ వివరించారు.

2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటుందని, 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో, 2050 నాటికి ప్రపంచంతోనే పోటీ పడగలిగే రాష్ట్రంగా ఏపీ ఉంటుందన్నారు లోకేష్‌. విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతోందని వివరించారు. విశాఖలో ఫింటెక్‌ వ్యాలీ ఏర్పాటుతో ఫైనాన్సియల్‌ టెక్నాలజీ కంపెనీలు అన్ని విశాఖపట్నంకు వస్తున్నాయన్నారు. రాయలసీమ జిల్లాలు తయారీ రంగానికి హబ్‌గా మారుతున్నాయని గుర్తు చేశారు.

ఫాక్స్‌కాన్‌, సెల్‌కాన్‌, డిక్సన్‌, కార్బన్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ కంపెనీలు ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించాయి అన్నారు. అలాగే ఫ్లెక్స్‌ కంపెనీ త్వరలోనే ప్రారంభం కాబోతోందని.. ఒకే చోట 6600 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని లోకేష్‌ గుర్తు చేశారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‌లో నెంబర్‌ వన్‌గా ఉన్నామని వివిధ కంపెనీల సీఈవోలకు లోకేష్‌ ఈ భేటీలో ఏపీ లో ఉన్న మౌలిక కల్పనలు.. సదుపాయాల గురించి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here