తెలంగాణ వాతావరణ వివరాలను తెలుసుకునేలా యాప్

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వాతావరణ వివరాలను తెలుసుకునే లా ఒక యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ను ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు.. ఎల్‌ఐసీ సహకారంతో తెలంగాణ ప్రణాళికాభివృద్ధి సంస్థ రూపొందించిన ఈ యాప్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 వాతావరణ స్టేషన్ల సహకారంతో పని చేస్తుంది. రాబోయే 3 రోజుల వాతావరణ సమాచారం సైతం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి TS వెదర్ యాప్ అని టైప్ చేసి ఈ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here