ఏపీ పోలీస్ బాస్ గా ఆర్ పి ఠాకూర్ నియామయం

ఈరోజుతో ఏపీ డిజిపి మాలకొండయ్య పదవీ కాలం పూర్తీ అయ్యి.. పదవీ విరమణ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కొత్త డిజిపి ఎవరా అని ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్‌పి ఠాకూర్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త డీజీపీ కోసం సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. చివరకు ఠాకూర్‌ను డీజీపీగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ ఉన్నారు. ఠాకూర్ వచ్చాక అవినీతి అధికారుల భరతం పట్టారు. దీంతో డీజీపీగా ఠాకూర్ నియమించేది అనుమానమే అని సావంగ్‌కే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. డీజీపీ ఎంపికపై చంద్రబాబుతో అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత ఎంపికపై చంద్రబాబు అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసి చివరకు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here