అగ్రిగోల్డ్ భూమి 200 ఎకరాలు గుర్తింపు

అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ అధికారులు అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 200 ఎకరాలు గుర్తించారు. విశాఖపట్నం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భూముల ఉన్నట్లు సీఐడీ అధికారులు నిర్ధానించారు. ఈ భూమి విలువ 9 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించారు. ఆ భూములు స్వాధీనం చేసుకునేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here