నీరవ్ మోదీని అప్పగించాలని బ్రిటన్ కు భారత్ దరఖాస్తు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోదీ తమదేశంలోనే ఉన్నట్లు బ్రిటన్ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో నీరవ్ మోదీ ని సిబిఐ అధికారులుకు అప్పజెప్పాలని భారత్ ఒక దరఖాస్తును బ్రిటన్ అధికారులకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఈ అభ్యర్థనను పంపినట్లు అధికారులు తెలిపారు. వెంటనే నీరవ్ మోదీని నిర్బంధించాలని, అతనికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఇప్పటికే తాము నీరవ్ మోదీకు వ్యతిరేకంగా ఇచ్చిన ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కాపీని కూడా పంపామని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here